AAS

*అప్రయత్న పదోన్నతి పథకం:**(Automatic Advancement Scheme)*

*G.O.Ms.No.65  Fin Dt: 17.06.2021 )*

💥 *స్పెషల్ గ్రేడ్ పోస్టు (SPP-I) స్కేలు:*

ఒక పోస్టులో 6సం॥ సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగికి ప్రస్తుతము తాను పొందుతున్న స్కేలు తదుపరి స్కేలు ను స్పెషల్ గ్రేడ్ పోస్టు స్కేలు గా మంజూరుచేస్తారు.

💥 *స్పెషల్ ప్రమోషన్ పోస్టు స్కేలు:*

దీనిని SPP-IA,SPP-IB అను రెండు భాగాలుగా విభజించారు.

☀ ఒక పోస్టులో 12సం॥ స్కేలు పూర్తిచేసిన ఉద్యోగికి తాను పొందబోవు  తదుపరి ప్రమోషన్ పోస్టు స్కేలును SPP-I స్కేలుగా మంజూరుచేస్తారు.అయితే ప్రమోషన్ పోస్టుకు కావలసిన అర్హతలు కలిగియుండాలి.12సం॥ సర్వీసు కలిగి,సర్వీసు రూల్స్ ననుసరించి తదుపరి ప్రమోషన్ లేని పోస్టుల్లో పనిచేస్తున్న వారికి స్పెషల్ గ్రేడ్ స్కేలు తదుపరి స్కేలును SAPP-IA స్కేలుగా మంజూరుచేస్తారు.

☀ ఒక పోస్టులో 18సం॥ సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగికి తాను పొందుతున్న SPP-IA/SAPP-Iఆ స్కేలులోనే ఒక ఇంక్రిమెంటు అదనంగా మంజూరుచేస్తారు. దీనిని SPP-IB/SAPP-IB స్కేలుగా వ్యవహరిస్తారు.

💥 *స్పెషల్ ప్రమోషన్ పోస్టు స్కేలు(SPP-II)*

☀ ఒక పోస్టులో 24సం॥ సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగికి సర్వీసురూల్స్ ప్రకారం తాను పొందబోవు రెండవ ప్రమోషన్ పోస్టు స్కేలును SPP-II స్కేలుగా మంజూరుచేస్తారు.అట్లే SAPP-I స్కేలు పొందుతున్న ఉద్యోగికి, దాని తదుపరి స్కేలును SPP-II స్కేలుగా మంజూరుచేస్తారు.

☀ ఒకవేళ SPP-I స్కేలు పొందుతున్న ఉద్యోగికి 2వ ప్రమోషన్ పోస్టులేని సందర్భంలో SPP-I స్కేలు తదుపరి స్కేలును SPP-II స్కేలుగామంజూరుచేస్తారు.
అట్లే  SAPP-IA స్కేలు పొందుతున్న ఉద్యోగికి, దాని తదుపరి స్కేలును SPP-II స్కేలుగా మంజూరుచేస్తారు.



*************



*సందేహం--సమాధానం*

ప్రశ్న: *నా వయస్సు 55సం.లు. నేను స్కూల్ అసిస్టెంట్ గా 12 సం.లు సర్వీసు పూర్తి చేసితిని 12 సం.లు స్కేలు రావడానికి నేను EOT, GOT పరీక్షలు పాస్ అయ్యాను. నాకు12 సం.లు ఇంక్రిమెంట్ ఏ తేదీ నుంచి ఇస్తారు?
సమాధానం: *ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ లో 12 సం.లు పొందడానికి స్కూల్ అసిస్టెంట్ కేడర్ లో EOT, GOT పరీక్షలు వ్రాసి ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైతే ఆఖరి పరీక్ష తేదీ నుండి వర్తింపచేస్తారు.


ప్రశ్న: *నాకు 50 ఇయర్స్ దాటినవి. నేను స్కూల్ అసిస్టెంట్ గా పనిచేయుచున్నాను. నాకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటానికి EOT, GOT పాస్ కావాలా?
సమాధానం: *G.O.Ms.No.93, Dt.03.04.2010 లో రెగ్యులర్ ప్రమోషన్ కి ఇచ్చిన రాయితీలు అన్నీ AASకు కూడా వర్తించునని పేర్కొనబడినది. అయితే ఆర్థికశాఖ వారి మెమో నెం.034408/248/PC-2/2011, Dt.02.04.2012 ద్వారా ఈ నిబంధనను నిరాకరిస్తూ వివరణ ఇచ్చినది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కూడా 12 సం.లు ప్రమోషన్ స్కేలు పొందడానికి EOT, GOT లలో ఉత్తీర్ణత కావలసియున్నది


ప్రశ్న: *SGTలలో 50 సం.లు దాటినవారు EOT, GOT పాస్ కాకుండా 24 సం.ల స్కేలు పొందుటకు అర్హులా..?
సమాధానం: *కారు. వారు కూడా G.O.Ms.No.93, Dt.03.04.2010 ప్రకారం అందుకు సంబంధించిన విద్యార్హతలు మరియు డిపార్ట్ మెంట్ టెస్టులు ఉత్తీర్ణత పొంది ఉండాలి.

ప్రశ్న : నా వయస్సు 54 సం.లు, B.Sc. TTC అర్హతలతో 2006 నుంచి LFL HM గా పనిచేస్తున్నాను. 2018 సంవత్సరంలో 12 సంవత్సరముల స్కేలు పొందడానికి అర్హత ఉన్నదా ?
సమాధానం  :  లేదు. ఆటోమాటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం ఉత్తర్వులు G.O.MS No. 38, ఆర్థిక, తేది : 15-4-2015 ప్రకారం SPP - (A) (సం.) స్కేలు మంజూరు చేయాలంటే తదుపరి ప్రమోషన్ పోస్టుకు  అవసరమైన విద్యార్హతలు కలిగి యుండాలి. (LFL HM) తదుపరి ప్రమోషన్ పోస్టు (హైస్కూల్ HM) ప్రమోషన్ పొందాలంటే B.Ed. ఉండాలి. మీకు B.Ed. లేదు కనుక 12 సంవత్సరముల స్కేలు పొందే అర్హత లేదు.

************************



For Related GOs Click  on ------------->  GOs DIARY