PENSION


❇ *పెన్షన్ లోని రకాలు* ❇

*నార్మల్ ఫ్యామిలి పెన్షన్ రూల్-50:*
ఉద్యోగిగా ఉంటూ లేక విరమణ పొందిన అనంతరం మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు ఇచ్చునదే ఫ్యామిలి పెన్షన్.చివరి నెల జీతంలో 30% కుటుంబ పెన్షన్ గా చెల్లిస్తారు.

*ఎన్ హేన్స్ ఫ్యామిలి పెన్షన్:
దీన్ని సాధారణంగా కుటుంబ పెన్షన్ అందురు.ఉద్యోగిగా ఉంటూ లేక పదవీ విరమణ పొందిన అనంతరం మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు మరణించిన తేది నుండి 7 సం॥ వరకు గానీ,జీవించియుంటే 65 సం॥ వయస్సు పూర్తగు తేది వరకు గాని ఏది తక్కువైతే ఆ తేది వరకు ఉద్యోగి చివరి జీతంలో 50% కుటుంబ పెన్షన్ గా చెల్లిస్తారు.అయితే ఇది పదవీ విరమణ వయస్సు నుండి పొందే పెన్షన్ కు మించరాదు.ఎన్ హేన్స్ ఫ్యామిలి పెన్షన్ తేది తర్వాత నార్మల్ ఫ్యామిలి పెన్షన్ 30% వస్తుంది.

*సూపరాన్యూ యేషన్ పెన్షన్ రూలు-32,33 మరియు 42:
ప్రభుత్వం నిర్ణయించిన పదవీ విరమణ వయస్సు సుపీరియర్ సర్వీసు ఉద్యోగికి 58 సం॥ క్లాస్-IV సర్వీసు ఉద్యోగికి 60 సం॥ నిండిన వారికి ఇట్టి పెన్షన్ ఇస్తారు.

 *ఇన్వాలిడ్ పెన్షన్ రూలు-37:
ఉద్యోగి అనారోగ్యం వల్ల ఉద్యోగము చేయుటకు అనర్హుడని వైద్యాధికారి ధృవీకరణపై రిటైరగు వారికి ఇవ్వబడు పెన్షన్.

*కంపల్సరీ రిటైర్మెంటు పెన్షన్ రూలు- 39,40:
ఉద్యోగిని ప్రభుత్వం నిర్భంధ పదవీ విరమణ చేయించినపుడు ఇచ్చు పెన్షన్.ఇది ఇన్వాలిడ్ పెన్షన్,గ్రాట్యూటీల కు మించకుండా 2/3 వంతుకు తక్కువగా ఉండాలి.కనీస పెన్షన్ కు తగ్గకూడదు.17-4-2001 నుండి కమ్యూటేషన్ కూడా మంజూరు చేస్తారు.

 *ప్రోవిజినల్ పెన్షన్ రూలు-52:
ఏదైనా క్రమశిక్షణ చర్యలు,ఉద్యోగి రిటైరయ్యే నాటికి పెండింగ్ ఉంటే ఆ క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు చెల్లించే పెన్షన్.ఇది చట్ట ప్రకారం పదవీ విరమణ చేసే ఉద్యోగికి అనుమతించే
పెన్షన్ లో 75% తగ్గకుండా ఉండాలి.కేసు యొక్క తీవ్రతను బట్టి పెన్షన్ పెంచుకోవచ్చును.అయితే ఇది ఎప్పుడూ 100% ఇవ్వకూడదు.పూర్తయి ఫైనల్ ఇచ్చేటప్పుడు ప్రోవిజినల్ పెన్షన్ కు సర్ధుబాటు చేసి మిగిలింది చెల్లించబడును.గ్రాట్యూటీ చెల్లించబడదు.

**************

@    సందేహం :-ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉంటుంది?ఏయే బెనిఫిట్స్ వర్తిస్తాయి?

జవాబు- 20 సంవత్సరాల సర్వీసు నిండిన ఉద్యోగి యొక్క కోరిక ప్రకారం రిటైర్ అగుటకు అనుమతించబడును.
( G.O (P) No. 88, Finance and Planning (Finance Wing) P.N.C. Dept, Date: 26-01-1980* ) రూల్ : 42,43


పెన్షన్ కమ్యూటేషన్:
               
వాలెంటరీ రిటైర్మెంటు పొందిన ఉపాధ్యాయుడు తన పెన్షన్ లో 40% అమ్ముకోవచ్చును.* దీనినే *పెన్షన్ కమ్యూటేషన్* అంటారు.
( G.O.m.s.No: 158, Finance and Planning ; Date: 16-09-1999)
గమనిక:- రిటైరైన సంవత్సరంలోగా సంబంధిత అధికారిగారికి దరఖాస్తు చేసుకోవాలి. సంవత్సరం దాటితే మెడికల్ టెస్టులు, అనేక వివరాలతో జాప్యం జరుగుతుంది


పెన్షన్:

పదవీ విరమణ చేయునాటికి 10 సంవత్సరములు అంతకంటే ఎక్కువ సర్వీసు చేసిన వారికి పెన్షన్ ఇస్తారు.
పెన్షన్ లెక్కించు విధానము:-
*చివరి నెల వేతనం× అర్థ సం„యూనిట్లు × 1/2 × 1/66 సూత్రం ప్రకారం లెక్కిస్తారు

*20 సంవత్సరాలకు వాలెంటరీ రిటైర్మెంటు కోరితే 5సంవత్సరాల వెయిటేజిని కలిపి సర్వీస్ కాలమునకు కలిపి పెన్షన్ నిర్ణయిస్తారు.

* కుటుంబ పెన్షన్ వివరాలు

*రిటైర్మెంట్ గ్రాట్యుటీ

మినిమం క్వాలిఫైయింగ్ సర్వీస్:
5 ఇయర్స్ ఫైనాన్షియల్ బెనిఫిట్: క్వాలిఫైయింగ్ సర్వీస్ పొడవు ఆధారంగా. సుమారు మొత్తం Rs.12.00 లక్షల .

డెత్ గ్రాట్యుటీ

0-1 సంవత్సరాలు సేవ: 6 టైమ్స్/ 4 (చెల్లింపు రోజు)
1-5 సంవత్సరాల సేవ: 18 సార్లు / 4 (పే,డీఏ )
5-18 సంవత్సరాల సర్వీస్: 36 సార్లు 4 (పే-డే) > 18 సంవత్సరాల సేవ: 38
/4 (చెల్లించాల్సిన రోజు)
మాక్సిమం మొత్తం: Rs.12.00 లక్షల. కుటుంబ పింఛను ఉద్యోగి / పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులకు ఇవ్వబడుతుంది.

పెన్షన్ రకాలు

1. పెంపొందించిన కుటుంబ పెన్షన్ :-

 మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:
ఏడు సంవత్సరాలు కంటే ఎక్కువ ఏడు సంవత్సరాల కాలానికి 50% చివరి చెల్లింపు మరియు ఏడు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలుగా చెల్లింపులు.

2.  కుటుంబ పెన్షన్ : -

 మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:

 ఒక సంవత్సరం నుండి 7 సంవత్సరాల. పెంచిన కుటుంబ పెన్షన్ ముగిసిన తరువాత, కుటుంబ పింఛను ఇవ్వబడుతుంది. మొత్తం చెల్లింపు మరియు అనుమతుల యొక్క 30%

3.  అదనపు సాధారణ కుటుంబ పెన్షన్:-

 అతని / ఆమె విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అతని పింఛను ఇవ్వబడుతుంది,

                                                                    *FAMILY PENSION*

 సర్వీస్ లో ఉండి గానీ, రిటైర్ ఐన తరువాత గానీ ఉద్యోగి మరణించిన ,అతని భార్య కు ఇచ్చే పెన్షన్ ను ఫ్యామిలీ పెన్షన్ అంటారు .

 7ఇయర్స్ సర్వీస్ లోపు చనిపోతే, భార్యకు పే లో 30% ఫ్యామిలీ పెన్షన్ గా ఇస్తారు.

 7ఇయర్స్ సర్వీస్ పైన చేసి రిటైర్మెంట్ లోపు చనిపోతే రెండు రకాలుగా భార్యకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు.

a) మొదటి 7 ఇయర్స్ కి 50%

b) 7 ఇయర్స్ తరువాత నుండి 30%.

Example 1:

ఓక ఉద్యోగి సర్వీస్ లో ఉండగా మరణించెను.అప్పటికి అయన సర్వీస్ 3y 6m. అపుడు ఆతని పే 7740 ఐన, భార్య కు వచ్చే ఫ్యామిలీ పెన్షన్
 ➡ 7740×30/100 =2322.00
ఇది భార్య కు జీవితాంతం ఇస్తారు.

 Example 2:

 ఉద్యోగి మరణించే నాటికి చేసిన సర్వీస్ 8y 4m. అపుడు పే 11530.ఐన, అతని భార్య కు మొదటి 7ఇయర్స్ వచ్చే ఫ్యామిలీ పెన్షన్
 11530×50/100=5765.00.

 7 ఇయర్స్ తరువాత నుండి జీవితాంతం వచ్చే ఫ్యామిలీ పెన్షన్👉11530×30/100 = 3459.00

కుటుంబ పెన్షన్ కొన్ని ముఖ్యాంశాలు
కుటుంబ పెన్షన్ కొన్ని ముఖ్యాంశాలు:Family pension for teachers
(R U L E 50 to 59)


ఉద్యోగిగా ఉంటూ మరణించినా,పదవీ విరమణ చేసిన తర్వాత మరణించినా అతను/ఆమె కుటుంబమునకు ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు.

✍ సర్వీసులో వుండి మరణిస్తే మొదటి 7సం॥ వరకు,ఉద్యోగి 65సం॥ వయస్సు నిండే వరకు ఏది ముందు అయితే అంతవరకు చివరి నెల జీతంలో 50% పెన్షన్గా చెల్లిస్తారు.

✍ పెన్షనర్ రిటైరయిన తదుపరి చట్టబద్ధంగా వివాహం చేసుకోన్నచో పెన్షనర్ భార్య/భర్తకు వారికి కలిగిన సంతానం కూడా కుటుంబ పెన్షన్కు అర్హులే.

✍ అదృశ్యమైన,ఆచూకి తెలియని ఉద్యోగుల కుటుంబాలకు సంవత్సరం తదుపరి కుటుంబ పెన్షన్ ఇస్తారు.

✍ సంపాదనా పరులుకాని అంగవికలురైన పిల్లలకు కూడా కుటుంబ పెన్షన్ సౌకర్యం వర్తిస్తుంది.

✍ పెన్షనర్ చనిపోయిన రోజునకు కూడా పెన్షన్ చెల్లిస్తారు.ఆ మరుసటి రోజు నుండి కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు.

✍ కుటుంబ పెన్షన్ పై D.R చెల్లిస్తారు.

✍ ఫామిలీ పెన్షనర్ పునర్వివాహము చేసుకుంటే ఫామిలీ పెన్షన్ రద్దవుతుంది.
(Rule 50(5) (I)

✍ చనిపోయిన మొదటి భార్య పిల్లలు రెండవ భార్యతోపాటు కుటుంబ పెన్షన్ వాటాకు అర్హులు.
(Rule 50(6)(A)(1)

✍ మొదటి భార్య బ్రతికి వుండగా ప్రభుత్వ అనుమతి లేకుండా పెళ్ళి చేసుకుంటే రెండవ భార్య కుటుంబ పెన్షన్కు అర్హురాలు కాదు.
(Cir.Memo.No.4027/B/26/pensn-1/87 Fin  Dt:20-8-1981)

✍ విడాకులు పొందిన భార్య పిల్లలు కుటుంబ పెన్షన్లో వాటాకు అర్హులే.
(G.O.Ms.No.20 Dt:24-1-1981)

✍ స్పెషల్ టీచర్ సర్వీసు పెన్షన్కు లెక్కించబడుతుంది.
(G.O.Ms.No.119 Edn Dt:21-4-1998)
(G.O.Ms.No.92 Edn Dt:8-8-2000)

@@@@

COMMUTATION

 @ ఉద్యోగికి లభించే పింఛను నుంచి 40% మించ కుండా ఒకేసారి నియమ నిబంధనల మేరకు ఏకమొత్తంగా అతను నగదుగా మార్చుకునే పద్దతినే "కమ్యూటేషన్" గా పరిగణిస్తారు.

@ ఈ పద్దతి 1-4-1999 నుండి అమలులోకి వచ్చింది.1-4-1999 తేదీన గాని,అటు తర్వాత గాని పదవీ విరమణ గాని,చనిపోయిన ఉద్యోగి విషయంలో గాని ఈ సూత్రం వర్తిస్తుంది.
(G.O.Ms.No.158 F&P తేది:1-4-1999)

@ శాఖాపరమైన న్యాయస్థానాలలో గనుక ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు అపరిష్కృతంగా ఉన్నట్లయితే కమ్యూటేషన్ మంజూరు చేయబడదు.
(Rule 3(3) of Commutation Rules 1994)

@ కమ్యూటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనవసరంలేదు. ప్రభుత్వం
G.O.M.No.263 తేది:23-11-1998 ద్వారా నిర్దేశించిన పింఛను ఫారంలోనే,పింఛనుతో పాటు కమ్యూటేషన్ ను కూడా తెలియజేయవచ్చు.
(G.O.Ms.No.356 F&P తేది:28-11-1989)

@ పెన్షన్ కమ్యూటేషన్ చేసిన తరువాత తగ్గిన పెన్షన్ 15సం॥ తర్వాత మాత్రమే తిరిగి పూర్తి పింఛను వస్తుంది.ఈ విధంగా మరల పూర్తి పెన్షన్ పొందిన తర్వాత రెండవసారి కమ్యూట్ చేయు అవకాశం లేదు.
(G.O.Ms.No.44 F&P తేది:19-02-1991)

@ 15 సం॥ కాలపరిమితిని కమ్యూట్ చేసిన మొత్తం పొందిన తేది నుంచి గానీ లేక ఆ మొత్తం వసూలు చేసుకోమ్మని జారీచేసిన ఉత్తర్వులు 3 నెలల తర్వాత గానీ ఏది ముందైతే ఆ తేది నుండి లెక్కిస్తారు.
(G.O.Ms.No.324 F&P తేది:20-08-1977)

@ కమ్యూటేషన్ మొత్తం పొందిన తర్వాత ఏ కారణము చేతనైనా పెన్షన్ సవరించినయెడల,తత్ఫలితంగా పెన్షన్ ఎక్కువ అయిన సందర్భాలలో తదనుగుణంగా పెరిగినటువంటి కమ్యూటేషన్ మొత్తం కూడా చెల్లించవలసియుంటుoది.
(G.O.Ms.No.392 F&P తేది:02-12-1993)

@ కమ్యూటేషన్ మొత్తానికి,గ్రాట్యూటి మాదిరిగా గరిష్ట మొత్తంను నిర్దేశించలేదు.ఎంతమేరకు అర్హులో అంతవరకూ పొందవచ్చు.
**********
Funeral Charges

@     సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగ,ఉపాధ్యాయులకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం Rs.20,000 చెల్లిస్తారు.
(G.O.Ms.No122 తేది:11-04-2016)

@    మరణించిన ఫామిలీ మరియు సర్వీసు పెన్షనర్లందరికీ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఒకనెల పెన్షన్ లేదా Rs.20,000 చెల్లిస్తారు.పెన్షనర్ కన్నా ముందే మరణించే భార్యకు కూడా మొత్తాన్ని చెల్లిస్తారు.
(G.O.Ms101 తేది:21-04-2015)

@    ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అంత్యక్రియల ఖర్చు నిమిత్తం Rs.10,000 చెల్లిస్తారు.
(G.O.Ms.No.38 తేది:28-05-2013)

@    ఫామిలీ పెన్షనర్ చనిపోతే కుటుంబంలో ఎవరూ లేనిచే వారసులకు చెల్లిస్తారు.
(G.O.Ms.No.136 తేది:29-06-2011)

***********

Example of  Pension Calculation :

@  పుట్టిన తేదీ:...10/06/1972
@  నియామకపు తేదీ:....26/10/1998
Basic pay....38130
Cadre.....SGT
DATE OF RETIREMENT.....30/06/2030

ప్రశ్న: *నేను స్వచ్ఛంద పదవీవిరమణ 01/06/2020 నాడు తీసుకుంటే  నాకు రావలసిన పెన్షన్ మరియు బెనెఫిట్స్ దయచేసి తెలుపగలరు.*

జవాబు:

*వాలంటరీ రిటైర్మెంట్ కు 5 సంవత్సరాల వెయిటెజి కలుపుతారు*

*పూర్తిచేసిన సర్వీసు 22 సంవత్సరాలు+ 5 సంవత్సరాల వెయిటేజి మొత్తం సర్వీసు 27 సంవత్సరాలు*

 *33 సంవత్సరాలు 66 అర్ధ సంవత్సర యూనిట్లు ఆ ప్రకారం 27 సంవత్సరాలకు 54  సంవత్సర యూనిట్లు*

 *ప్రస్తుత DA 33.536%*

*పెన్షన్: 38130×27/66 =15,599/-*

*గ్రాట్యుటీ: 38130*12787( DA )×54×1/4 = 6,87,339/-

*కమ్యూటేషన్: (40%)=38130×40/100=6240/-

         *6240×12×8.913= 6,13,492/-*

 *మొత్తం పెన్షన్ 15,599 లో నుండి 40% కమ్యూటేషన్ మొత్తం తీసివేయగా 15,599-6240 = 9,359*

* 9359 ki ప్రస్తుతం DR కలుస్తుంది (33.356%)
9359+3138= 12,677*

*మొత్తం చేతికొచ్చే పెన్షన్ = 12,677*

 *GO.100 Dt:21.7.2015 ప్రకారం 350 మెడికల్ అలవెన్స్ కూడా పెన్షన్ కు కలుపుతారు.
*******
Cell phone ద్వారా పెన్షనర్లు life certificate సమర్పించు విధానము

@    ప్రతి సంవత్సరము పెన్షనర్లు తాము బతికే ఉన్నట్లు November 1 నుండి February 28 లోగా ఫోటోతో నిర్ణీత దరఖాస్తు ఫారంలో సంబంధిత ట్రెజరీ అధికారికి సమర్పించాలి. దీనిలో PPO NUMBER, ఆధారిత నంబర్, పెన్షన్ తో లింక్ అయిన ఆధార్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. 

@    అయితే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెన్షనర్ల life certificate సమర్పించడానికి ప్రభుత్వము ఆప్ ను రూపొందించింది. దీన్ని వినియోగించుటకు ఆండ్రాయిడ్/ఆపిల్  ఫోన్ లో T App Folio ను download చేసికోవాలి.

@    ఆప్ download అయిన తర్వాత మొదటి పేజి లో pensioner life authentication అనే ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే Registration, Registration status check, Authentication, Reciept అనే భాగాలు కనిపిస్తాయి. మొదట Registration ను టచ్ చేస్తే పెన్షన్ అకౌంట్ వివరాలు (పెన్షన్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నంబరు, PPO id, phone నంబర్ ) పూర్తి చేసి proceed కావాలి. 


@    తర్వాత ఫోటో కావాలని అడుగుతుంది. Cell phone తో selfie తీసి submit చేస్తే వివరాలు పూర్తవుతాయి. 1 లేదా 2 రోజుల్లో మనం సమర్పించిన వివరాలు ఆమోదించబడుతాయి. ఆ విషయాన్ని app లోని authentication లో చూస్తే విషయం తెలుస్తుంది. ఆమోదించబడితే ఆ సంవత్సరానికి life certificate సమర్పించే పని పూర్తవుతుంది. ట్రెజరీ కార్యాలయానికి వెళ్ళకుండ ఈ ఆప్ ద్వారా life certificate సమర్పించవచ్చు.
*****

Download :



For More Info Click on --------------------->>>>>   GOs DIARY