Exgratia

-: Payment of Ex gratia :-


(a) Death while on Duty: ఉద్యోగి డ్యూటీ చేస్తూ ప్రమాదవశాత్తు మరణిస్తే "లక్ష" రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తారు. (సాధారణ కారణాల వల్ల మరణించిన, సెలవుల్లోనున్ననూ అర్హులు కారు. గుండెపోటు ద్వారా మరణించినచో అది ప్రమాదం కాదుకాబట్టి అర్హులు కారు.) 
ఉదా: సైన్స్ టీచరు ప్రయోగం చేస్తూ ప్రమాదవశాత్తు ప్రయోగశాలలో మరణించినా, స్కూల్ వాచ్మెన్ పహారాకాస్తు పాముకరిచి , భవనం కూలి మరణించడం వంటివి. 

* డెత్ సర్టిఫికేట్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ జతపరచాలి. పెన్షనరీ బెనిఫిట్స్ కు ఇది అదనం. 
  (G.O.MS.No.343 F&P, Dt24.7.97 )

*డ్యూటీకి వెళ్లునప్పుడు, డ్యూటి నుండి తిరిగి వచ్చునప్పుడు ప్రమాదం సంభవించి మరణించినప్పుడు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తారు.

 (బి) Death in Elections duty: ప్రభుత్వంచే నియమించబడి  ఎన్నికల  విధులు నిర్వహిస్తుండగా మరణించనవారికి 10 లక్షల రూపాయల వరకు మించకుండా ఎక్స్ గ్రేషియా చెల్లించబడును. (G.O.MS.No.317GAD, Dt:7.7.2006) మరియు G.O.Ms. No. 150 13-11-14)


(సి ) Terorists Attacks: తీవ్రవాదుల దాడిలో ఆస్తినష్టపోయినచో (G.O.Ms.No.94 GAD Dt:18.8.2000) ప్రకారం 1.5 లక్షల నుండి 3 లక్షల వరకు ఉద్యోగులకు నష్టపరిహారం చెల్లిస్తారు. చూపు పోయినా, కాళ్లు, చేతులు
కండ్లు పూర్తిగా పోయినా 5 లక్షలు చెల్లిస్తారు. (G.O.Ms.No. 150 GAD, Dt:13.11.2014)

*************