CRP Job Chart


*క్లస్టర్ రిసోర్సు పర్సన్ (CRP) జాబ్ ఛార్ట్* :

* పాఠశాల సముదాయం సమావేశ నిర్వహణలో కిందిఅంశాలలో పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయులకు, అసిస్టెంట్ సెక్రటరీకి సహకరించడం.

• సమావేశ నిర్వహణ ఏర్పాటును చేయడం, సమావేశ అజెండాను అనుబంధ పాఠశాలలకు తెలపడం. సమావేశ మినిట్స్ ను సంబంధిత రిజిష్టరులో నమోదు, డాక్యు మెంటేషన్ నివేదికను రూపొందించడం. సమావేశానికి మాదిరి పాఠ్యాంశ ప్రదర్శనకు, ఇతర సెషన్లకు అవసరమైన బోధనాభ్యసన సామగ్రిని సమకూర్చడం.

• సమావేశంలో విషయ నిపుణుడిగా వ్యవహరించడం.

• సమావేశ నిర్వహణకు అవసరమైన మానవ వనరులను గుర్తించడం వారి సేవలను వినియోగించుకోవడం.

* ఉపాధ్యాయులకు ఒక విషయ నిపుణుడిగా సాయమందించడం,

• మాదిరి పాఠ్యాంశ ప్రదర్శనను ఇవ్వడం

• ఉపాధ్యాయులకు వృత్తిపరమైన సాయాన్ని అందించడం.

• వివిధ సబ్జెక్టులకు సంబంధించిన కఠిన భావనలకు బోధనాభ్యసన సామగ్రిని రూపొందించడం. అన్ని సబ్జెక్టులలో ప్రశ్నా నిధులు, పరీక్షాంశాలను రూపొందించడం.

*ఉపాధ్యాయులు వారు బోధిస్తున్న తరగతికి పూర్తిచేసిన సిలబస్ ప్రకారం సొంతంగా ప్రశ్నాపత్రాలను రూపొందించుకోవడంలో తగిన సాయం అందించడం.

• వృత్యంతర శిక్షణ కార్యక్రమాలలో విషయ నిపుణుడుగా వ్యవహరించడం.

• పాఠశాలల్లో అమలులో ఉన్న వివిధ గుణాత్మక కార్యక్రమాలను మానిటరింగ్ చేయడం. + డేటాబేస్ నిర్వహణ.

• క్లస్టర్ పాఠశాలల నుండి డేటాను సేకరించడం, క్రోడీకరించడం.

• క్లస్టర్‌కు అనుసంధానం చేయబడిన ఆవాసప్రాంతాలలోని 6-14సం||ల వయస్సుగల పిల్లలందరి సమాచారాన్ని సేకరించడం.

• క్లస్టర్ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న భౌతిక సదుపాయాలు, ఇంకా అవసరమున్న భౌతిక సదుపాయాలు మొదలగు వివరాలను సేకరించడం.

• ఉపాధ్యాయుల డేటా బేస్ భోదనోపకరణాలు - టివి, రేడియో, ఆరిసిసిపి, డివిడి ప్లేయర్, డిష్ అంటెన్నా, గణితం / సైన్స్ కిట్లు, ఛార్జులు, నమూనాలు,  మ్యాపులు, పాఠ్య పుస్తకాలు, కంప్యూటర్, ప్రయోగశాల పరికరాలుమొ॥ వాటిని నిర్వహించడం, వినియోగించడం.

*. పాఠశాల సముదాయం గ్రంధాలయ నిర్వహణ -స్టాక్ రిజిస్టర్‌లో గ్రంధాలయ పుస్తకాలను నమోదు చేయడం. రిఫరెన్స్ పుస్తకాలను ఉపాధ్యాయులకు ఇవ్వడం, తిరిగి తీసుకోవడం. ఈ వివరాలను ఇష్యూ రిజిష్టర్ లో నమోదు
చేయడం.

• గ్రంధాలయ పుస్తకాలు / మ్యాగజైన్లు సమకూర్చు కోవడంలో సముదాయ ప్రధానోపాధ్యాయులకు సహకరించడం.

• పాఠశాల సమూదాయానికి సంబంధించిన అన్ని రికార్డులను నిర్వహించడం.

* క్లస్టర్ స్థాయి ఎగ్జిబిషన్లు, మేళాలు మొ|| నిర్వహిం చడంలో పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులకు సహకరించడం

• బడిబయటి పిల్లల కొరకు ముఖ్యంగా పని నుండి విముక్తి పొందిన బాలకార్మికుల కోసం ఉద్దేశించబడిన అన్ని కార్యక్రమాలను అమలు చేయడం.

• పాఠశాల సముదాయ విధులలో - నమోదు, నిలకడ, సామర్థ్యాల సాధనలో నాణ్యతలలో ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకొని నమోదు చేయడంలో సహకరించడం.

• పాఠశాలల్లో నమోదు కాని, ద్రాపౌట్ అయిన పిల్లల చదువు గురించి కృషి చేయడంలో తన వంతు పాత్రను పోషించడం.

• పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు అకడమిక్ అంశానికి సంబంధించి అప్పగించే ఏ ఇతర పనినైనా నిర్వర్తించడం.